ఎండల తీవ్రత.. దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి

దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. సోమవారం, ఏప్రిల్ 27న, దేశవ్యాప్తంగా గరిష్టంగా 255.85 గిగావాట్ల విద్యుత్తును వినియోగించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వాడకం పెరగడమే దీనికి కారణమని పేర్కొంది. ఈ నెలలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది జూన్‌లో 242.77 గిగావాట్లు, 2024 మేలో 250 గిగావాట్లు, 2023 సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ ఏడాది గరిష్టంగా 270 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్