AP: ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం, 2025-26 విద్యా సంవత్సరం నుంచి కాలేజీలు జూన్ ఒకటో తేదీకి బదులుగా ఏప్రిల్ ఒకటి నుంచే ప్రారంభమవుతాయి. ఏప్రిల్ ఏడో తేదీ నుంచే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఇక వార్షిక పరీక్షలను 2026 మార్చికి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించబోతున్నారు.