TG: ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 24 నుండి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి బోర్డు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈసారి మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ఉండటంతో, వీలు కాకపోతే మార్చి 3 నుంచి పరీక్షలు ప్రారంభించేలా ప్రత్యామ్నాయ షెడ్యూల్ను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.