ప్రేమ పేరుతో వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని ఆత్యహత్య (వీడియో)

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం విషాద ఘటన నెలకొంది. వరుసకు సోదరుడైన మనోజ్ కుమార్ ప్రేమ పేరుతో వేధించగా, చివరికి అతని ప్రేమను అంగీకరించినా పెళ్లికి నిరాకరించడంతో విద్యార్థిని డిసెంబర్ 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ప్రేమ పేరుతో లోబర్చుకుని, పెళ్లికి నిరాకరించి, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని విద్యార్థిని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో మనోజ్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్