TG: డెంగీతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో జరిగింది. ముర్తుజగూడకు చెందిన సామ రిషితారెడ్డి(17) మణికొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల రిషితారెడ్డికి జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తరగతులకు హాజరైంది. మూడు రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో HYDలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రిషితారెడ్డి ప్రాణాలు విడిచింది.