TG: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకం కింద ప్రభుత్వం రూ.344 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేయనుంది. అన్ని నియోజకవర్గాల్లో శనివారం నుంచి ఈ నెల 18 వరకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఆ వెంటనే ఆయా సంఘాల ఖాతాల్లో ఈ నిధులు జమవుతాయి. ఇందుకు ప్రభుత్వం ఇటీవల రూ.344 కోట్లను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కి విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు చెల్లిస్తారు.