చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం: కేంద్రం

కేంద్ర ప్రభుత్వం జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికానికి పోస్టాఫీసులోని అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి) పథకంపై వడ్డీ రేటు 7.7% వద్ద కొనసాగుతుంది. ఈ పథకంలో రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు, గరిష్ట పరిమితి లేదు. 10 సంవత్సరాల లోపు పిల్లల పేరు మీద కూడా ఖాతా తెరవవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. రూ.11.50 లక్షలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత కేవలం వడ్డీ రూపంలోనే రూ.5 లక్షలకు పైగా సంపాదించవచ్చు.

సంబంధిత పోస్ట్