డీఆర్డీఓ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (సీహెచ్ఈఎస్ఎస్ డీఆర్ డీఓ) 20 పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 75 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ ఎం.టెక్/ ఎంఎస్సీ పూర్తిచేసిన 27 ఏళ్లలోపు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 11 చివరి తేదీ. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.drdo.gov.in ను సందర్శించండి.