నిజామాబాద్ జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పది మంది సభ్యుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 40 కిలోల కాపర్ కాయిల్స్‌తో పాటు రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్‌ను దొంగిలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 101 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించినట్లు కేసులు నమోదయ్యాయి. ఆదివారం సీపీ సాయిచైతన్య వెల్లడించారు.