AP: ఎన్టీఆర్ జిల్లాలోని ఊర్మిళానగర్ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన ప్రైవేట్ ఫొటోలు భర్తకు పంపించడంపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెహానా అనే మహిళకు ఇన్‌స్టాలో సాయి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఆమె అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తకు తెలియకుండా సాయితో బయటకు వెళ్లింది. ఈ క్రమంలో సాయితో బయటికి వెళ్లిన ఫొటోలు రెహానా భర్తకు పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.