డేటింగ్ యాప్‌లో పరిచయం: యువకుడిని కిడ్నాప్ చేసి రూ.7 లక్షల దోపిడీ

ఢిల్లీలో డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతితో డేట్‌కు వెళ్లిన అనురూప్ నరులా అనే యువకుడిని కిడ్నాప్ చేసి, రూ.7 లక్షలు దోచుకున్నారు. 'షెర్రీ' అనే యువతి ఆహ్వానం మేరకు నెహ్రూ ప్లేస్‌కు వెళ్లిన అతడిపై ముగ్గురు యువకులు దాడి చేసి, కారులో కిడ్నాప్ చేశారు. బెదిరించి యూపీఐ, ఏటీఎం, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బు బదిలీ చేయించుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ రికార్డులు, డిజిటల్ లావాదేవీల విశ్లేషణతో క్యాబ్ డ్రైవర్ రిషభ్ రాఘవ్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్