అరుణాచల్‌ప్రదేశ్‌లోకి చైనా దళాలు అక్రమంగా చొరబడ్డాయనే నివేదికలపై భారత్ తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల్లో నెలకొనే పరిస్థితులే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆగస్టు 6న జరిగిన భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం ఏర్పాటు చేసిన వర్కింగ్ మెకానిజం (WMCC) 36వ సమావేశంలోనూ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. సరిహద్దుల్లో శాంతిభద్రతలను కాపాడటం అత్యంత కీలకమని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయరాని భాగమని ఆయన స్పష్టం చేశారు.