ఢిల్లీలో కాసేపట్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి , ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సహా పలువురు మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతేడాది మొదటిసారి నిర్వహించిన సమ్మిట్ విజయవంతం కావడంతో. రెండోసారి భారీ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్‌కి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది.