AP: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. శివశంకర్ తన స్నేహితుడు ఎర్రిస్వామితో బైక్‌పై డోన్‌కు వెళ్తుండగా, కావేరి బస్సు ఢీకొట్టింది. ఘటనా సమయంలో శివశంకర్ అక్కడే మృతి చెందగా, ఎర్రిస్వామికి గాయాలు అయ్యాయి. అయితే ఎర్రిస్వామి వెంటనే ఘటనాస్థలి వదిలి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు ఎర్రిస్వామిని పట్టుకొని విచారిస్తున్నారు. కాగా, విచారణ తర్వాతే ప్రమాదంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.