ఐఫోన్ 18.. భారీ మార్పులతో ఆపిల్ కొత్త ఆవిష్కరణలు

టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. రాబోయే ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లలో మెరుగైన పనితీరు, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, కొత్త డిస్‌ప్లే టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో డైనమిక్ ఐలాండ్ పరిమాణం 35% వరకు తగ్గనుంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 5,100mAh నుంచి 5,200mAh బ్యాటరీ, ప్రధాన కెమెరాలో వేరియబుల్ అపర్చర్ సిస్టమ్, కొత్త స్టాక్డ్ ఇమేజ్ సెన్సార్, మెరుగైన జూమ్ సామర్థ్యం ఉండనున్నాయి. కొత్త తరం A20 చిప్‌సెట్‌తో పనితీరు 15% మెరుగుపడనుంది. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్