ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌గా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి ఇది హోమ్ గ్రౌండ్. అయితే, ముంబై ఇండియన్స్‌ను గత 14 ఏళ్లుగా వేధిస్తున్న ఒక విచిత్రమైన రికార్డు ఉంది. అదేంటంటే సీజన్‌లో ఆడే మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం. చివరిసారిగా 2012లో తొలి మ్యాచ్ గెలిచిన ముంబై, 2026లో తన సొంత మైదానంలో ఆడుతూ ఈ చెత్త చరిత్రను తుడిచేయాలని కంకణం కట్టుకుంది. మరోవైపు, వాంఖడేలో తనకున్న చెత్త రికార్డును తుడిచేయాలని కేకేఆర్ పట్టుదలతో ఉంది.