ఐపీఎల్ 2026 మినీ వేలం భారత్‌లోనే ?

ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ ఆక్షన్ భారత్‌లోనే జరిగే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా విదేశాల్లో జరిగిన వేలం ఈసారి ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. డిసెంబర్ 13 - 15 మధ్య అహ్మదాబాద్ వేదికగా ఆక్షన్ జరిగే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్