కాసేపట్లో లక్నో-ఢిల్లీ మధ్య పోరు.. పిచ్ రిపోర్ట్ ఇదే!

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ, లక్నో మధ్య ఐపీఎల్ 2026లో తొలి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు ఈ సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత సీజన్‌లో విఫలమైన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది. షమీ, నోర్జే, మయాంక్ యాదవ్ వంటి పేసర్లతో లక్నో బౌలింగ్ బలంగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచ్‌లలో ఢిల్లీ 4, లక్నో 3 విజయాలు సాధించాయి. ఏకానా పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్