IPL-2026లో భాగంగా ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా LSGతో జరిగిన మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. KKR బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగి ఆడటంతో ఈ మాత్రం గౌరవప్రదమైన స్కోర్ చేసింది. రింకూ 51 బంతుల్లో 83* పరుగులు చేశారు. గ్రీన్ 34 పరుగులతో రాణించారు. LSG టార్గెట్ 156 రన్స్.