ఐపీఎల్ 2026లో భాగంగా నేడు న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో PBKS, RR మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం చండీగఢ్‌లో 20-30 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. బీబీసీ వెదర్ ప్రకారం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 40% వర్ష సూచన ఉన్నా, రాత్రికి తగ్గుముఖం పట్టనుంది. ఈ సీజన్‌లో ముల్లాంపూర్‌లో ఇదే చివరి మ్యాచ్ కానుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.