ఐపీఎల్ వాయిదా ఇది రెండోసారి

18 ఏళ్ల చరిత్రలో ఐపీఎల్ టోర్నీ వాయిదా పడడం ఇది రెండోసారి. గతంలోనూ 2021లో కోవిడ్ కారణంగా ఐపీఎల్ సీజన్ వాయిదా పడింది. తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకున్నాక పునఃప్రారంభమైంది. అదే తరహాలో ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సీజన్‌ను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మ్యాచ్‌ల నిర్వహణ, ప్రేక్షకుల భద్రత సవాళ్లుగా మారడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్