IPL: ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన సంజూ శాంసన్

IPL: GTతో జరిగిన మ్యాచులో CSK ఓపెనర్ సంజూ శాంసన్(11) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. ఈ క్రమంలోనే సంజూ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నారు. టోర్నీలో తక్కువ బంతుల్లో(3,555) ఐదు వేల రన్స్ చేసిన మూడో బ్యాటర్‌గా ఆయన నిలిచారు. ఈ క్రమంలోనే CSK దిగ్గజం ధోనీ(3,691 బంతులు) రికార్డును బ్రేక్ చేశారు. అలాగే ఆయన కేఎల్ రాహుల్(3,688), రైనా(3,620)ను కూడా అధిగమించారు. ఇక సంజూ కంటే డివిలియర్స్(3,288), వార్నర్(3,554) ముందున్నారు. ఈ మేరకు IPL, CSK ఓ ఫోటోను పోస్ట్ చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్