IPL ప్రారంభం.. నేడు SRH vs RCB తొలి పోరు

వేసవిలో వినోదాన్ని పంచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సిద్ధమైంది. శనివారం నుంచి రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 26 మ్యాచ్‌లలో SRH 14, RCB 11 విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారీ హిట్టర్లతో కూడిన SRH జట్టు నేడు ఎలాంటి ప్రదర్శన చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్