ఐపీఎల్ టికెట్లు: ఎమ్మెల్యేలకు ఉచితంగా మూడు చొప్పున కేటాయింపు

కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఐపీఎల్ టికెట్లు ఉచితంగా లభించనున్నాయి. క్యూలైన్‌లో నిలబడకుండానే ఎమ్మెల్యేలకు ఈ టికెట్లు అందనున్నాయని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్, సీఎం సిద్ధరామయ్యను కలిసి తెలిపారు. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్‌తో పాటు, స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గతంలో టికెట్ల విషయంలో కేఎస్‌సీఏపై ఎమ్మెల్యేలు విమర్శలు చేయడంతో, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్