వచ్చే వారం IPOల హవా

వచ్చే వారం ఐపీఓలతో స్టాక్ మార్కెట్ సందడిగా మారనుంది. మెయిన్‌బోర్డ్ విభాగంలో కుసుమ్‌గర్ లిమిటెడ్, లేజర్ పవర్ & ఇన్‌ఫ్రా, ఎస్‌ఎంఈ విభాగంలో డెవ్‌సన్ క్యాటలిస్ట్, హ్యాపీ స్టీల్స్ తమ ఐపీఓలను ప్రారంభించనున్నాయి. కుసుమ్‌గర్ ఐపీఓ జూలై 8-10, మిగతా మూడు జూలై 9-13 మధ్య అందుబాటులో ఉంటాయి. కుసుమ్‌గర్ ఐపీఓకు గ్రే మార్కెట్‌లో మంచి ప్రీమియం ఉండగా, ఇతర ఇష్యూలపైనా ఆసక్తి నెలకొంది. అయితే కంపెనీల ఆర్థిక పరిస్థితి, రిస్క్‌లు పరిశీలించిన తర్వాతే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్