TG: మేడారం జాతరలో ఇప్పపువ్వు లడ్డు, బెల్లం లడ్డు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. లడ్డు తయారీ ద్వారా 500 మంది మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారానికి వస్తారని, 19న మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పపువ్వులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు.