ఐపీఎస్ పూర‌న్ ఆత్మ‌హ‌త్య కేసు.. లీవ్‌పై వెళ్లిన డీజీపీ

హర్యానాలో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో, రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను ప్రభుత్వం లీవ్‌పై పంపింది. ఆత్మహత్య కేసులో నమోదైన ఎఫ్ఐఆర్‌లో కపూర్ పేరు కూడా ఉంది. రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను కూడా మార్చుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించారు. దళితులపై దాడులపై విమర్శల నేపథ్యంలో డీజీపీని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్