పవర్ ప్లాంట్ పై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారతీయులు మృత్యువాత పడుతున్నారు. కువైట్లోని పవర్ ప్లాంట్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ చేసిన దాడిలో ఓ భారత కార్మికుడు చనిపోయాడు. దీంతో యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆ ప్రాంతానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలను పంపినట్లు కువైట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్ఫ్ దేశంపై ఇది ఇరాన్ దురాక్రమణ చర్య అని మండిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్