కువైట్ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ దాడి (వీడియో)

గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన దాడులను తీవ్రతరం చేసింది. తాజాగా కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భీకర దాడి చేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్‌కు చెందిన ‘అల్ సల్మీ’ అనే భారీ ముడి చమురు నౌక దుబాయ్ పోర్టు వద్ద ఉంది. దీనిపై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేయగా.. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటన తీవ్రత ఉన్నప్పటికీ.. 24 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని అధికారులు ధ్రువీకరించారు.

సంబంధిత పోస్ట్