అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ఆపేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. టెహ్రాన్ అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధి దాటుతున్న పాక్ చమురు ట్యాంకర్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేల్చివేసింది. దుబాయ్, అబుదాబి సముద్ర తీర ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం కూడా ఇరాన్ ఒక పాక్ నౌకను అడ్డుకుంది. ఈ దాడులతో ఇరాన్-పాక్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.