ఇరాన్-ఇరాక్ యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం, ముఖ్యంగా ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తూ, ఈ మార్గంలో వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. అయితే, భారత్ వంటి మిత్ర దేశాలకు ఈ జలసంధి తెరిచే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో శనివారం భారత్‌కు వస్తున్న రెండు ఎల్పీజీ ట్యాంకర్లకు (BW ELM, BW TYR) ఇరాన్ అనుమతి ఇచ్చింది. ఇవి హార్ముజ్ నుంచి ఒమన్ గల్ఫ్ మీదుగా భారత్ వైపు వస్తున్నాయి. ఈ రెండు ట్యాంకర్లు భారత తీరానికి మరికొన్ని రోజుల్లో చేరుకోనున్నాయి.