మిడిల్ ఈస్ట్‌లోని అన్ని అమెరికా మిలిటరీ స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 4 దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతర్‌తో పాటు ఇరాక్, బహ్రెయిన్, కువైట్‌లోని US మిలిటరీ బేస్‌లపై ఇరాన్ దాడికి దిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ముందు జాగ్రత్తగా ఖతర్, యూఏఈ తమ గగనతలాలను మూసివేశాయి. ఈ ఆపరేషన్‌కు "Bashayer Al-Fath"అని పేరు పెట్టినట్లు ఇరాన్ స్టేట్ టీవీ ప్రకటించింది.