పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలైన అల్-రిఫా, అవాలిలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ దాడి కారణంగా ఒక పౌర పారిశ్రామిక కేంద్రం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.