మధ్యంతర ఒప్పంద చర్చల వైఫల్యానికి అమెరికానే ప్రధాన కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం మళ్లీ కొత్తగా చర్చలు ప్రారంభం కావాలని ఇరాన్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. చర్చలు పునఃప్రారంభం కావాలంటే, అమెరికా తన బెదిరింపు ధోరణిని మానుకోవాలని, తమ దేశంపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.