హర్మూజ్ జలసంధిని తెరిచి కనీసం ఒక్క రోజు అయినా గడవకముందే మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా హామీలను విస్మరించి నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తోందని ఆరోపించింది. ఇరాన్ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను అమెరికా అడ్డుకోవడం ఆగేంతవరకు ఈ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా అమెరికా చర్యల వల్ల హర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది.