హర్మూజ్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్‌

హర్మూజ్‌ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్‌ తమ నియంత్రణలోనే ఉందని, దాన్ని ఎప్పుడు మూసివేయాలి, ఎప్పుడు తెరవాలన్నది ఇరాన్‌ నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. జలసంధిని ఎవరూ ఆక్రమించుకోలేరని తేల్చి చెప్పింది. అమెరికా యుద్ధ నౌకల మోహరింపుతో తాము భయపడబోమని ఇరాన్‌ ప్రకటించింది. ట్రంప్‌ ఇటీవల హర్మూజ్‌పై అమెరికాకు “పూర్తి నియంత్రణ” ఉందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇరాన్‌ తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్