ట్రంప్ హెచ్చరికలు.. కొత్త ఆయుధాలతో దాడి చేస్తాం: ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ గట్టిగా బదులిచ్చింది. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గేది లేదని, ఫతేహ్‌, ఖేబర్‌ షేకన్‌ వంటి అధునాతన మిస్సైళ్లతో దాడులను రెట్టింపు చేస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా సైన్యం హద్దులు దాటితే మిడిల్ ఈస్ట్ దాటి ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. తమపై దాడులు కొనసాగితే అమెరికా, మిత్రదేశాలకు చమురు, గ్యాస్‌ అందకుండా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించింది. చర్చలు అంటూనే ఇరాన్ నాగరికత అంతమైపోతుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్