అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ధ్రువీకరించారు. సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకుని, మరో రెండు వారాల పాటు హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతామని తెలిపారు. ఇరాన్‌పై దాడులు ఆగిపోతే, తమ సైన్యం కూడా రక్షణాత్మక చర్యలను నిలిపివేస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ 10 పాయింట్ల ప్రతిపాదనలపై చర్చించడానికి అమెరికా అంగీకరించిందని కూడా ఆయన తెలిపారు.