అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్పందించిన అమెరికా సెంట్రల్ కమాండ్, మే నెల నుంచి హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 800 వాణిజ్య నౌకలు, 380 మిలియన్ బ్యారెళ్ల చమురును ఈ మార్గం ద్వారా తరలించినట్లు ఎక్స్‌లో పోస్టు చేసింది. యుద్ధ విరామం తర్వాత నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయని, ఇరాన్ నియంత్రణ లేదని స్పష్టం చేసింది.