ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు చాలావరకు మరణించారని పేర్కొన్నారు. ఇరాన్‌లోని వందలాది లక్ష్యాలపై, ఐఆర్‌జీసీ స్థావరాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, 9 నౌకలపై ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేసి ధ్వంసం చేశామని తెలిపారు.