ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆ దిశగా తాను ప్రయత్నిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టు చేశారు. తన మధ్యవర్తిత్వంలో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పిన ఆయన.. ఆ క్రెడిట్ మాత్రం తానెప్పుడూ తీసుకోలేదని తెలిపారు.