క్షిపణుల పరిధిపై పరిమితి ఎత్తేశాం: ఇరాన్‌

బాలిస్టిక్ క్షిపణుల పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. దీంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అభివృద్ధి చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు హద్దుల్లేని ప్రతిదాడులు చేయాలని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చిన వారం రోజులకే ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 2,000 కిలోమీటర్లకు మించిన పరిధి కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నట్లు అధికారిక సమాచారం లేదు.

సంబంధిత పోస్ట్

✕
✕