గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా, ఈ దాడుల్లో భాగంగా క్షిపణి శకలాలు యూఏఈలోని అబుదాబిలో పడటంతో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. అబుదాబి అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఒక బాలిస్టిక్ క్షిపణిని సమర్థవంతంగా అడ్డుకున్నాయని తెలిపింది. కెజాద్‌లోని రెండు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు పడటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు భారతీయులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.