ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని బందాస్ అబ్బాస్ పోర్టు ప్రాంతంలో అమెరికా దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ కువైట్‌లోని అమెరికా బేస్‌పై బాంబులతో దాడి చేసింది. ఈ దాడులను మరింత తీవ్రతరం చేస్తామని, అమెరికాకు తగిన రీతిలో బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.