అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన మూడు ఆయిల్ ట్యాంకర్లు, మూడు ఇతర షిప్లపై దాడి చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. సదరన్ రూట్లో అమెరికా రక్షణతో వెళ్తుండగా ఈ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు IRGC వెల్లడించింది. అంతకుముందు, మూడు ఇరానియన్ క్రూడాయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.