జర్మనీపై ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్ర విమర్శలు

గత రెండు వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో, జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందించారు. జర్మనీకి మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు లేదని, వారి ద్వంద్వ విధానాలు విశ్వసనీయతను దెబ్బతీశాయని విమర్శించారు. ఇజ్రాయెల్ దాడులను జర్మనీ ప్రశంసించిందని, అమెరికా చర్యలపై మౌనంగా ఉందని ఆరోపించారు. ఇరాన్‌లో జరిగిన ఘర్షణల్లో 12 వేల మంది చనిపోయారని, 10 వేల మందికి పైగా అరెస్టు అయ్యారని కథనాలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్