ఇజ్రాయెల్‌పై భారీ దాడికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్టోబర్ 7, 2023న హమాస్ దాడి కంటే విస్తృతంగా దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అంచనాలను ఉటంకిస్తూ ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా లెబనాన్‌లోని హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్-సిరియాలోని ఇరాన్ అనుకూల మిలీషియాలను సమన్వయం చేసి ఒకేసారి దాడులు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సమన్వయ లోపంతో విఫలమైన వ్యూహాన్ని ఈసారి అధిగమించేందుకు ఇరాన్ ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.