అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేశాం: ఇరాన్

అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ ప్రాంతం గగనతలంలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన యుద్ధ విమానాన్ని ఇరాన్ భద్రతా దళాలు కూల్చివేసినట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జామ్ కౌంటీ గవర్నర్ మసూద్ టాంగెస్థానీని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా తస్నీమ్ ఈ వార్తను ప్రచురించింది. అయితే, ఈ కథనాలను అమెరికా తోసిపుచ్చింది. ఆ ప్రాంతంలో తాము ఏ విమానాన్నీ నష్టపోలేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్