ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సలహాదారు జావద్ లారిజాని ఓ టెలివిజన్‌తో మాట్లాడుతూ.. ట్రంప్‌కు ఆయన ఫ్లోరిడా నివాసం కూడా సురక్షితం కాదంటూ, డ్రోన్ దాడి జరగొచ్చని హెచ్చరించారు. ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తప్పదని హెచ్చరించారు.