ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బగేరిని మరణించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. అయితే దీన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఆ దేశ మిలిటరీ విభాగం స్పందించింది. 'ఎప్పుడూ యుద్ధం కోరుకోం. కానీ కావాలని ఎవరైనా ఆహ్వానిస్తే సరైన సమాధానం చెబుతాం' అని ట్వీట్ చేసింది.